ఆశల దీపం
గదిలో గాఢాంధకారంలో
గబ్బిలాలు గంధర్వగానం
చేస్తున్నాయి
గూటిలోని గువ్వలు
గుసగుసలాడుతున్నాయి
కుక్కలు ఆరుబయట
కునుకు తీస్తున్నాయి
నక్కలు ఎక్కడో ఏటిగట్టు
మీద ఎందుకో ఏడుస్తున్నాయి
ఆకాశంలో చంద్రుడు
ఆకలితో నకనకలాడుతున్నాడు
చుక్కలు రెక్కలు తొడుక్కొని
రెపరెపలాడి రచ్చచేస్తున్నాయి
నింగి నేల రెండు నిశ్శబ్దంగా
నిట్టూరూస్తున్నాయి
రేపటి సూర్యుడు కత్తులు
నూరుతున్నాడు
చీకటిని చిత్రవధ చేయడానికి
కళ్ళల్లో కాగడాలు వెలిగించుకొని
సుప్రభాతం కోసం సూర్యోదయం
కోసం నిరీక్షిస్తుంది నా ఆశలదీపం



