మెరుపులు మెరిస్తే
ఉరుములు ఉరిమితే
మేఘాలు కరుగుతాయని
చినుకులు రాలుతాయని సంకేతమే
హోరుగాలులు వీస్తే
బోరు బోరున కుంభవర్షాలు కురిస్తే
వచ్చే వరదభీభత్సానికది సంకేతమే
కడలిలో
అల్పపీడన ద్రోణి ఏర్పడి
అలలు ఎగిసిపడితే
ఆపై బలహీనపడితే
విరుచుకుపడనున్న
పెనుతుఫానుకది సంకేతమే
వేగంగా పెనుగాలులు వీచి
హోరుగాలులు వీస్తే
జోరుగా కుంభవర్షాలు కురిస్తే
విద్యుత్ స్తంభాలు విరిగితే
వేలాదిగాచెట్లు నేలకొరిగితే
పొంచిఉన్న తీవ్రతుఫానుకు
వచ్చే వరద భీభత్సానికది సంకేతమే
తీవ్రతుఫానే తీరందాటితే
సముద్రం ఉగ్రరూపం దాలిస్తే
సర్వంధ్వంసం చేసే
సునామీకది సంకేతమే
ఔను ప్రతిసంకేతం
ప్రమాదానికి హెచ్చరికే
ఈ కరోనా కాలాన
సమయస్ఫూర్తితో
సత్వర చర్యలు చేపట్టి
భౌతిక దూరం పాటిస్తే
తరచు చేతులు శుభ్రం చేసుకొంటే
ముఖానికి డబుల్ మాస్కులు ధరిస్తే
ముందుజాగ్రత్తలు తీసుకుంటే
కరోనా పెనుముప్పు తిప్పిపోయి
ఇంటిల్లిపాదికి...సంతోషమే...
సంక్రాంతిసంబరమే



