Facebook Twitter
రెండక్షరాల రోగం

నాకు తెలివి-   లేదు లేదు
ఇది నావల్ల -    కాదు కాదు
నాకు ఏ పనీ -  రాదు రాదు
నేనేమీ చేయ్య- లేను లేను అనే
రెండు పదాలు పదే పదే పలికేవాడు

ముందుచూపు లేని మూర్ఖుడు
పరమ బద్దకస్తుడు, సోమరిపోతు,
శుంఠ, వెధవ, వెర్రివాడు, దద్దమ్మ

అట్టివాడికి అడుగు దూరంలో కాదు
60 అడుగుల దూరంలో ఉంటేనే
నీవు ముందు కెళ్ళగలవు, లేదంటే

నీకు కూడా "ఆ రెండక్షరాల రోగం"
అంటు వ్యాధై సోకుతుంది అప్పుడు
నీ జీవితం సర్వనాశనమే ఇక
నీవు సంకనాకి పోవడం ఖాయమే జాగ్రత్త