త్రికాల యజ్ఞం
గతాన్ని గురించి
తలంచి తలంచి
గతించిపోయే వారి
బ్రతుకులు గాఢాంధకారం
భవిష్యత్తు గురించి
ఊహించి ఊహించి
బాగుపడు వారి
బ్రతుకులు బంగారుమయం
వర్తమానంలో తన కర్తవ్యం తాను
నిర్వహించి నిర్వహించి హాయిగా
నిదురించే వారి కళ్ళముందే
ప్రత్యక్షమౌతుంది ప్రతిఫలం
కారణం
ప్రతి వర్తమానం పరమాత్మ
ప్రసాదించే వరం
అది అందిననాడు అందరి
బ్రతుకులు అమృతమయం



