మొదటి శుభఘడియ: శ్రీ రామజననం
కోసల రాజైన దశరథుడు
ముద్దుల భార్యలు ముగ్గురున్నా
వారసుడు లేక విలవిలలాడే
పుత్రసంతానానికి పాపం పరితపించే
వశిష్ట మహర్షి సలహామేర
పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించే
అగ్నిదేవుడు ప్రసన్నుడై పాయసపాత్రను
అందజేసి దశరథుడికి అదృశ్యమాయే
త్రాగిపాయసం ముగ్గురు తల్లులాయే
త్రేతాయుగంలో...
వసంత రుతువులో...
చైత్ర మాసంలో...
శుద్ధ నవమినాడు...
గురువారం రోజు...
పునర్వసు నక్షత్రంలో...
కర్కాటక లగ్నంలో...
అభిజిత్ ముహూర్తంలో...
మధ్యాహ్మం 12.05 ని.లకు
కౌసల్య గర్భఫలంగా...
ధర్మ సంస్థాపనార్థం...
రావణసంహారార్థం...
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు
ఏడో అవతారంగా...
క్రీ.పూ 5114 జనవరి 10 న
జగతిలో రాముడుగా జన్మించే...
జయ జయరామ జానకిరామాయని
నిత్యం శ్రీ రామనామాన్ని జపించినవారికి
దక్కును వేయిజన్మల పుణ్యఫలమే
రెండవ ఘడియ: శ్రీసీతారాముల కళ్యాణం
మూడవ ఘడియ : శ్రీ రాముని పట్టాభిషేకం ఈ
మూడు ఒకరోజు రావడమే ఒక వింత విశేషం విచిత్రం



