Facebook Twitter
దొంగెవరు?

చెరువుగట్టు‌ చేరి

ఓ కొంగ ఆకలేసి 

పాపం చేపపిల్లలకోసం 

ఒంగీ...ఒంగీ...తిరుగుతూవుంటే 

నీటిలో...

తొంగీ...తొంగీ...చూస్తూవుంటే 

అందరూ ఆ కొంగను 

దొంగా... దొంగా... అన్నారు

 

నిజానికి ఆ కొంగను పుట్టించింది 

చెరువులోని చేపల్ను పుట్టించింది 

ఆ పరమాత్మే..... 

కొంగకు తిండి చెరువులో చేపలే

అది దైవ నిర్ణయమే...

ఆకలి తీరాలంటే చేపలు తినాలే

అది ప్రకృతి ధర్మమే...

మరి కొంగ దొంగ ఎలా ఔతుంది?

 

కానీ ఓ మనిషీ!  

నీ ఆహారం చేపలు‌ కాదు కానీ

నీవు ఏ నదిలోనో... ఏ చెరువులోనో 

ఏ గాలాన్ని వేసో...ఏ వలల్ని విసిరో

స్వేచ్చగా తిరిగే చేపల్ని పట్టుకుంటావ్

కమ్మగా కూరవండుకుని లొట్టలేసుకుతింటావ్

నీమనస్సాక్షి నడుగు ఎవరు దొంగ నీవా కొంగా?