మెరుపుదాడి
ఒక్కోసారి మనం
ఎంత శ్రమించినా
ఎంత కష్టపడినా
ఒత్తిడికి గురౌపోతాం
ఘోరంగా ఓడిపోతాం
ఐతే
పరాజితులమైనందుకు
మనం పోటీ నుండి
పారిపోకుండా
పాఠాలు నేర్చుకోవాలి
మళ్ళీ ఊహలకు ప్రతిఊహలతో
ఎత్తులకు పైఎత్తులు వేయాలి
ప్రత్యర్దులను ఉక్కిరిబిక్కిరి చేయాలి
అందరి ఊహలకందకుండా
మనపై పెట్టిన నమ్మకాన్ని
వమ్ము చేయకుండా
ఒకే లక్ష్యంతో ఒకే దీక్షతో
నాలుగు వైపులనుండి
ప్రత్యర్దులపై మెరుపుదాడి చేసి
విజయాన్ని సాధించాల
అప్పుడే అందరి ఆశీస్సులు
మనకు అందుతాయి
ఆటన్నాక గెలుపు ఓటములు తప్పవు
నేటి విజేత ముందెన్నోసార్లు పరాజితే



