అది మీ చేతుల్లోనే వుంది...?
ఓ ఆశాజీవులారా ! అపరభక్తులారా !
మీరు ఒక పచ్చినిజాన్ని తెలుసుకోండి !
మీరు రోజు గుడిమెట్లు ఎక్కుతారు
భక్తితో భగవంతునికి మొక్కుతారు
గుడి చుట్టూ తిరుగుతారు
గుండుచేయించుకుంటారు
వెంకటేశ్వరుని దర్శించుకుని
వేడుకుంటారు కరుణించమని
కొంచెం చిల్లర హుండీలో వేసి
"కోటి వరాలు" కోరుకుంటారు
కాని ఏ దేవుళ్ళయినా
ఏ దేవతలైనా మీకు
వరాలనివ్వరు...
శాపాలనివ్వరు...
మీ ఘోరపాపాలను కడిగి
మిమ్మల్ని శుద్దిచేయరు...
"అవకాశాలను" మాత్రమే ఇస్తారు
అందుకు తగిన శక్తిని...సమయాన్ని
జ్ఞానాన్ని...ఆరోగ్యాన్ని...అందిస్తారు
ఆపై అందిన ఆ అవకాశాలను
మీరు "వరాలుగా" మార్చుకుంటారో?
లేక "శాపాలుగా" మార్చుకుంటారో ?
అది మీ ఇష్టం అది మీ చేతుల్లోనే వుంది
అంతామీ కష్టం మీ అదృష్టంపై ఆధారపడి ఉంది గుర్తుంచుకోండి !
ఇది ఎవ్వరూ కాదనలేని "నగ్నసత్యం" మరువకండి !



