Facebook Twitter
నిజజీవిత నిత్యసత్యం....

ఈ జీవితం ఒక నీటి బుడగని

అది ఏ క్షణంలోనైనా చితుకునని

ఈ జీవితం తామరాకు మీద

ఒక నీటి బిందువని అది ఏ 

నిమిషంలోనైనా క్రిందికి జారునని

 

ఈ జీవితం ఎవరో వెలిగించిన ఒక దీపమని

అది ఏ ఘడియలోనైనా ఆరిపోవునని

ఈ జీవితం ఒక మంచుముక్కని

అది నీ కళ్ళముందే కరిగి పోవునని

 

నీవు ఒక యాత్రికుడివని...

ఏ సత్రం నీది కాదని... 

నీవు ఒక తోటమాలివని...

ఏ తోట నీది కాదని...

నీవు ఒక కారు డ్రైవర్ వని... 

ఏ కారు నీది కాదన్న...

 

ఓ నగ్నసత్యాన్ని తెలుసుకొమ్మని

తెలుసుకొని తెలివిగా మసలు కొమ్మని

మసలుకొని మొద్దునిద్ర నుండి మేలుకొమ్మని

 

ఓ నా ప్రియ మిత్రులారా !

కమ్మని కలలెన్నో కానే మీకు నేఅందిస్తున్నా ఈ

నిజజీవిత నిత్యసత్యం నా అనుభవాల ఆణిముత్యం