ప్రార్థించే పెదవులకన్నా ...
పోరాడితే పొయేదేముందండి
చెప్పండి...
మీ బానిసత్వపు సంకెళ్లు తప్ప
నవ్వితే పొయేదేముందండి
చెప్పండి...
మీ ఆందోళన అనారోగ్యం తప్ప
పొరుగువారికి పొదుపు చేసుకోమని
సలహాఇస్తే పొయేదేముందండి చెప్పండి...
మీ మధ్య అనుబంధం పెరగడం తప్ప
జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం తప్ప
చేసిన మేలుకు మీకు గుండెల్లో గుడికట్టడం తప్ప
అందుకే అన్నారు పెద్దలు ప్రార్థించే
పెదవులకన్నా సహాయంచేసే చేతులే మిన్నని
కళ్ళు మూసుకున్న వాడు వెలుగును చూడలేడు
కాళ్ళు చేతులు ముడుచుకున్నవాడు అభివృద్ధి చెందలేడు



