Facebook Twitter
ఒక మంచి సందేశం చదివితే వెంటనే స్పందించండి..నచ్చితేనే?

ఒక మంచి మాట చెబితే వినండి
ఒక మంచి నిజాన్ని చెబితే నమ్మండి
ఒక మంచి సలహాను ఇస్తే స్వీకరించండి
ఒక మంచి సందేశాన్ని పంపితే చదవండి,

సమయముంటే స్పందించండి
స్పందిస్తే పోయేదేముంది చెప్పండి
ఎదుటి మనిషి మనసు కరగడం తప్ప
సంఘంలో మీ విలువ పెరగడం తప్ప

ఒక మంచి సందేశాన్ని చూసికూడా
చలనమంటూ లేనివారు,ఆలస్యం చేసేవారు,
ఒక మంచి సందేశాన్ని చదివి కూడా
సమయముండీ తక్షణమే స్పందించనివారు,

ఎన్ని నిజాలు చెప్పినా సంప్రదించనివారు
కొన్ని కొత్త విషయాలైనా తెలుసుకోవాలన్న
తపన లేనివారు
ఒక మంచిమాట చెబితే వినే ఓపిక లేనివారు
వాయిదా మీద వాయిదాలు వేసేవారు

భవిష్యత్తులో మాత్రం చాలా బాధపడతారు,

భారీగా నష్టపోతారు కుమిలిపోతారు కృంగిపోతారు
నలుగురిలో నువ్వులపాలౌతారు
వారు నిజంగా దుఖితులు, దురదృష్టవంతులు

కాని ఒక మంచి సందేశాన్ని చూసి,చదివి
తక్షణమే మరుక్షణమే ఆలోచించకుండా
స్పందించేవారు సంస్కారవంతులు
ఆలోచించి కాల్ చేసేవారు అదృష్టవంతులు
ప్రేమతో ప్రోత్సహించేవారు దైవాంశసంభూతులు

ఒక మంచి మెసేజ్ చూసి,చదివి కూడా
స్పందించని వారు ఎవరినీ నిందించలేరు
చేయిని అందిస్తే పట్టుకోలేనివారు చివరికి
ఊబిలోకి జారిపోయినా ఏనాడూ పైకి రాలేరు