Facebook Twitter
గజదొంగలకేల ? ఘనసన్మానాలు

చదివి, సమయమున్నా స్పందించని 
శుద్దబద్దకస్తులకేల ? "శుభ సందేశాలు"...

ఉలకని పలకని రాతిబొమ్మల కేల ? 
రాత్రింబవళ్ళు "పూజలు పునస్కారాలు"...
మతకల్లోలాలు సృష్టిస్తూ రక్తదాహం తీరని
రాక్షసులకేల ? "సన్మానాలు సత్కారాలు'...
గజదొంగలకేల ?ఘనసన్మానాలు..............
ఉత్సవవిగ్రహాల్లా ఊరంతా ఊరేగింపులు....

అమాయకుల్ని దోచుకొన్న 
లక్షలు కోట్లు దాచుకున్న
అక్రమంగా, ఆదాయానికి మించి 
ఆస్తుల్ని ఆర్జించిన ఊసర వెల్లులైన 
ఉద్యోగస్తులకేల ? "ఉన్నతమైన పదవులు"...

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ
అడ్డదారుల్లో తరతరాలకు తరగని 
ఆస్తుల్ని ఆర్జించాలని, తెగ ఆరాటపడే 
నకిలీ వ్యాపారస్తులకేల? "నంది అవార్డులు?"...

అభంశుభం ఎరుగని అమాయకపు 
అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, 
అత్యాచారం చేసి, అతికౄరంగా
కాల్చిచంపే కామాంధులకేల ? "క్షమాభిక్షలు"...