Facebook Twitter
రేపటిసూర్యోదయం కోసం...

నేటి ఈ 

మనోహర 

మంగళకర

సుందర శుభకర

సూర్యోదయాన్ని

నిన్నరాత్రి మూతపడని

మీ రెండుకళ్ళతో చూసి 

మురిసిపోవాలంటే...

 

ఆ పరమాత్మ 

ప్రసాదించే

ప్రశాంతతను

మదినిండుగా

తృప్తిగా పొందాలంటే...

 

ఆ ప్రకృతి ప్రసవించే

పచ్చదనాన్ని

కనులారా తిలకించి

మనసారా 

పులకించి పోవాలంటే....

నిజానికి నిన్న మీరెంతో

పుణ్యంచేసుకొని వుండాలి...

 

ఒక్కసారి ఆలోచించండి!

ఇంతటి మహద్భాగ్యాన్ని

అందించిన ఆ పరమాత్మను

ఒక్కసారి స్మరించుకుని

కృతజ్ఞతలు తెలియజేస్తే 

పోయేదేముంది చెప్పండి!

రేపటి సూర్యోదయాన్ని చూసే

మరోభాగ్యం లభించడం తప్ప...