బాల్యమంటే ఓ బంగారు గని....
బాల్యమంటే...
ఒక తీయనైన జ్ఞాపకాల పూలబుట్ట
కోటి కోర్కెల చెరగని చిరునవ్వుల చిట్ట
అమ్మానాన్నల ఆశల ఆనకట్ట కలలపుట్ట
బాల్యమంటే...
ఒక పచ్చని చెట్టు
మధురమైన తేనెపట్టు
దాచుకున్న తీపిజ్ఞాపకాల గుట్టు
ప్రశాంతతకు నిలయమైన ఓ గుడిమెట్టు
బాల్యమంటే...
ఒక అల్లరి ఆట, కమ్మని పాట
ఒక మధురమైన మాట ముత్యాల మూట
ఒక బంగరు బాట గుబాళించే ఒక పూల తోట
బాల్యమంటే...
అంతులేని
అమాయకత్వం
హద్దేలేని స్వేచ్ఛ
కల్లాకపటములేని
మాయమర్మమెరుగని
మరుమల్లెల పరిమళం
మందార మకరంద భరితం
మచ్చలేని ఓ స్వచ్చమైన జీవితం
బాల్యమంటే...
ఎవరికైనా ఒక తీపి అనుభవమే
వెనక్కి తిరిగి బాల్యంలోకి తొంగి చూస్తే చాలు
ఎన్నెన్నో మధురమైన మరిచిపోలేని తీపిజ్ఞాపకాలే
బాల్రమంటే...
ఎక్కడం దిగడం, ఏడ్వడం నవ్వడం
బాల్యం అంటే ఒక ఆశ, ఒక కమ్మని కల
తల్లిదండ్రులకు ఒక బరువు,ఒక పరువు ఒక బాధ్యత



