ముందు పోల్చుకో!
తరువాత తేల్చుకో!!
ఓ నా ప్రియ మిత్రమా !
ముందు నిన్ను నీవు
నీటిలోని కప్పతోనో
లేదా
నింగిలోని పక్షితోనో
పోల్చుకో
ఆ తర్వాత
ఎగిరే పక్షిలా ఎదగడమా
లేక
బావిలోని కప్పలా బ్రతకడమా
తేల్చుకో
మంచి ఆలోచనలకు
జన్మస్థానమేది?
మంచి ఆలోచనలు
పార్కులో తిరుగుతుంటే
పుట్టవచ్చు
బస్సులోనో రైళ్లను ప్రయాణంచేస్తున్నప్పుడు
పుట్టవచ్చు
గాఢంగా నిద్రపోయి
తెల్లవాఱు జామున
మూడు లేదా నాలుగు గంటలకు
మెలుకువ రాగానే
పుట్టవచ్చు
కుమార్ తో సరదాగా
ఫోన్లో మాట్లాడుతూ వున్నప్పుడు
పుట్టవచ్చు



