Facebook Twitter
నిన్న లేని కొత్తదారి

కొందరు కష్టపడి
నిన్న మొన్న ఉన్న
కాలిబాటనే - నేడు బండ్ల బాటగా
బండ్ల బాటనే -  మట్టి రోడ్డుగా
మట్టి రోడ్డునే - కంకర రోడ్డుగా   
కంకర రోడ్డునే - తారు రోడ్డుగా in
తారు రోడ్డునే - సిమెంటు రోడ్డుగా
మారుస్తారు
మరి కొందరు
ఆ సిమెంటు రోడ్డు మీదే
ఫ్లయ్ఓవర్ని నిర్మిస్తారు
అట్టి వారందరు గట్టివారే గొప్పవారే
కాని నిన్న లేని ఒక కొత్తదారిని
నేడు కనిపెట్టినవాడే
కష్టాలు తీర్చినవాడే
అందరికంటే గొప్పవాడు 

ఆపద్భాంధవుడు,ఆదర్శవంతుడు