Facebook Twitter
పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు...

పేదవాడిగా పుట్టడం నీ
...తప్పు కాదు కానీ
పుట్టి పేదవాడిగా మరణించడమే
...గొప్పనేరం

అప్పులు చేయడం నీ
...తప్పుకాదు కానీ
చేసిన అప్పుల్ని తీర్చకపోవడమే
...పెద్దతప్పు

తప్పు చేయడం నీ
...తప్పుకాదు కానీ
చేసిన తప్పును సరిదిద్దుకోకపోవడం
అదే తప్పును పదేపదే చేయడమే‌
...పెద్దతప్పు

తాళి కట్టడం నీ
...తప్పుకాదు కానీ
కట్టి భార్యాబిడ్డలను పోషించకపోవడం
వారిని పూర్తిగా విధికి వదిలివేయడమే
...పెద్దతప్పు

విదేశాలకు వెళ్లడం నీ
...తప్పుకాదు కానీ
వెళ్లి అమ్మానాన్నలను పూర్తిగా మర్చిపోవడం
ప్రేమతో అప్పుడప్పుడు పలకరించకపోవడమే
...పెద్దతప్పు

పెద్ద చదువులు చదవక పోవడం నీ
...తప్పుకాదు కానీ
అసలు చదువు విలువ తెలియకపోవడమే
...పెద్దతప్పు

రెండు చేతులతో ఆస్తులు ఆర్జించడం నీ
...తప్పుకాదు కానీ
ఆర్జించినదానిని పదిమందికి పంచకపోవడమే
...పెద్దతప్పు

అపారమైన విచ్చిజ్ఞానాన్ని ఆర్జించడం నీ
...తప్పుకాదు కానీ
ఆర్జించినజ్ఞానాన్ని అందరికీ అందించకపోవడమే
...పెద్దతప్పు .

ఆకలి గొనడం అది ప్రకృతి ధర్మం నీ
...తప్పుకాదు కానీ
ఆకలిని తీర్చుకునే మార్గాలు తెలియకపోవడమే
...పెద్దతప్పు

పెద్దల వద్ద సలహాలు సూచనలు స్వీకరించడం నీ
...తప్పుకాదు కానీ
స్వీకరించిన ఆ సలహాలను ఆచరించకపోవడమే
...పెద్దతప్పు

పరమాత్మను ప్రతిరోజు పూజించడం ప్రార్థించడం నీ
...తప్పుకాదు కానీ
నిత్యం పూజించే ఆ పరమాత్మపై
నిజమైనభక్తి విశ్వాసం‌ లేకపోవడమే
...పెద్దతప్పు

ఆస్తులు ఆర్జించడం నీ
...గొప్ప కాదు కానీ
ఆర్జించిన ఆస్తులను కాపాడుకోలేకపోవడం
వాటిని కొంచెమైనా అనుభవించక అస్తమించడమే
...పెద్దతప్పు