1) రాత్రి 10 గంటలకు "పడక" తెల్లవారుజామున
4 గంటలకు "నడక" సూత్రాన్ని తు.చ.తప్పక పాటించడం
2) నిద్ర మేల్కొన్న తర్వాత, లేచి మంచం పైనే
కూర్చుని చిన్న ప్రార్థన చేసుకోవడం
3) క్రమం తప్పకుండా ప్రతిరోజూ
వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం
4) ఉదయం 5 గంటలలోపు కాలకృత్యాలన్నీ
తీర్చుకోవడం స్నానం చేయడం
5) సూర్యోదయానికి ముందే ప్రతిరోజు
పూజా కార్యక్రమాలను పూర్తి చేయడం
6) టీవీ చూడకుండా&ప్రశాంతంగా
అల్పాహారం భోజనం తీసుకోవడం
7) 24 గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం
అందరినీ పలకరించడం మర్యాదగా మాట్లాడం
8) whatsapp, face book లకు
వీలైనంత తక్కువ సమయం కేటాయించడం
9) సొంత భార్యను పిల్లలను ప్రేమించడం వారితో కలిసి తినడం తిరగడం మాట్లాడడం ఆనందంగా గడపడం
10) తల్లిదండ్రులను గౌరవించడం&వారిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రేమగా పలకరించడం
11) అతిథులను ఆదరించడం గౌరవించడం
12) పేదవారికి చేయగలిగినంత సహాయం చేయడం
13) ఇతరులను బాధపెట్టకుండా ఉండడం
14) ఇతరులను మోసం చేయకుండా ఉండడం
15) మన కష్టాలు ఎన్నైనా ఏమైనా సరే
దేవునిపై గట్టి విశ్వాసం కలిగిఉండడం
16) ఇతరులకు బోధించే ముందు, మనం అనుసరించడం
17) ఎవరిమీద కోపం కసి కక్ష పగా ప్రతీకారం.అసూయ ద్వేషాలు ఆందోళన లేకుండా ప్రశాంతచిత్తంతో నవ్వుతూ నవ్విస్తూ బ్రతకడం
18) బైబిల్ భగవద్గీత ఖురాన్ భారత భాగవత
రామాయణ తదితర ఆధ్యాత్మిక గ్రంధాలను ప్రతినిత్యం పఠించడం, నేర్చుకున్న జ్ఞానాన్ని ,ఆర్జించిన ధనాన్ని పదిమందికి పంచడం,అనుభవించడం ఆత్మతృప్తితో
ఆ పరమాత్మను చేరడం....ఇదే ఈ జీవితానికి అర్థం పరమార్థమని తెలుసుకోవడం...



