ఎవరితరం కాదు ...
"కళ్లు" చెమర్చకుండా
సంసారాన్నిఈదడం
"కాళ్ళు" తడవకుండా
సముద్రాన్ని దాటడం
"పళ్ళు" కనిపించకుండా
విరగబడి నవ్వడం
వికటాట్టహాసం చెయ్యడం
"ఒళ్ళు" గుల్లకాకుండా
ఒలింపిక్స్ లో
పసిడిపతకం సాధించడం
"విల్లు" వంచకుండా
బాణాలు సంధించడం
"ముల్లు" గుచ్చుకోకుండా
గులాబీ పువ్వును త్రుంచడం
ఎవరితరం కాదు ఇది పచ్చినిజం



