ఏ పులైనా "గుహలోపడుకొని గురకలు పెడుతుంటే" ఆపై లేచి ఆకలంటూ కేకలు వేస్తుంటే ,అడవిలో జంతువులు వస్తాయా? నోట్లో పడతాయా ?లేదే
ఏ రైతైనా ఎద్దులున్నా పొలమున్నా అదనుచుసి పదును పెట్టకుండా పొలం దున్నకుండాసాగు చేయకుండా విత్తనం వేయకుండా "ఇంట్లోకూర్చుంటే" ఇంటికిపంట వస్తుందా? గాదెలు నిండుతాయా? లేదే
ఏ విద్యార్థైనా పరీక్షలు వ్రాయకుండా, పాసవకుండా ఇంటర్యూలకు వెళ్ళకుండా కంప్యూటర్ లో గేమ్స్ ఆడుకుంటూ "ఇంట్లోకూర్చుంటే" ఇంటికి ఉద్యోగం నెలకు జీతం వస్తుందా ? లేదే
ఏ వ్యక్తి అయినా చేతిలో అగ్గిపెట్టె వున్నా ఇంట్లో దీపమున్నా వెలిగించకుండా చిమ్మచీకటి కమ్ముకున్నదని "చింతిస్తూ కూర్చుంటే"ఏంటిలాభం
చీకటి తొలుగుతుందా ? వెలుగు వస్తుందా ? లేదే
ఏ తండ్రైనా తన కూతురు అందమైనదని అమెరికా లో చదివిందని ఊరంతా చెప్పినా సంబంధాలు చూడకూండా "ఇంట్లో కూర్చుంటే" ఇంటికి అల్లుడు వస్తాడా ? కూతురుకు పెళ్ళవుతుందా ? లేదే
ఏ మార్కెటింగ్ మేనేజరైనా "ఇంట్లో ఏ ఏసీ గదిలోనో " ఏ ఫ్యాను కిందనో హాయిగా కాలిమీద కాలు వేసుకొని "కాల్స్ చేస్తూ కూర్చుంటే" కస్టమర్లు యింటికి వస్తారా ? తలుపు తడతారా ? లేదే



