నీ బ్రతుకంతా...
ఓ మనిషీ!
నీ "బాల్యం"
నీ అమ్మానాన్న చేతుల్లో
నీ "విద్యా విజ్ఞానం"
నీ గురువుల చేతుల్లో
నీ "నవయవ్వనం"
నీ ప్రియురాలి చేతిలో
నీ "దాంపత్యజీవితం"
నీ భార్య చేతిలో
నీ "పరువు ప్రతిష్టలు"
నీ పిల్లల చేతుల్లో
నీ "ఉద్యోగం సంపాదన"
నీ బాస్ చేతిలో
నీ "ముసలితనం"
నీ భార్యాబిడ్డల చేతుల్లో
నీ "బ్రతుకంతా"
ఆ "భగవంతుని"
అమృత హస్తాలలో
ఆ కరుణామయుని
కటాక్ష వీక్షణాలపై ఆధారపడి
ఉంటుందంటే కాదనే వారెవరు?



