చీకటి పడకముందే దీపం వెలిగించుకోండి
ఇంటి దీపం ఆరక ముందే ఇన్సూరెన్సు చేసుకోండి
అనుమానాల అపార్ధాల అగ్నిఆరక పోతే
కుటుంబాలు కూలిపోతాయి
నేడెంత తాజాగా ఉన్నాసరే వాడక పోతే
రేపటికి పాలు చెడి పోతాయి
గుండెల్ని కదిపే దుస్సంఘటనలు జరిగినా గుణపాఠాలు
నేర్చుకోని వారి బ్రతుకులు గుడిసెలో వెలిగే గుడ్డి దీపాలే
ఆకులు రాలి పోతాయి, పూలు వాడి పోతాయి
పళ్ళు పండి పోతాయి, కూరగాయలు కుళ్ళి పోతాయి
కాలం కరిగే కొద్దీ ,వయసు పెరిగే కొద్దీ
నీ మరణం నీ తలుపు దగ్గర నిలుస్తుంది
చిరునవ్వుతో నిన్ను పిలుస్తుంది
ఇదే నీ చివరినిద్ర అంటుంది, మరణముద్ర వేస్తుంది
నీ గుండెను ఆపేస్తుంది, నీ కళ్ళను మూసేస్తుంది
ఈ లోకానికి నిన్ను దూరం చేస్తుంది
ఆత్మీయులందరిని, దుఃఖ సాగరంలో ముంచుతుంది
దయ దాక్షిణ్యం లేకుండా నిన్ను లాక్కెళ్తుంది
ఈ ప్రపంచంలో దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు అది అంతే .



