మనమాటలు...నీటిమూటలైతే...
మిత్రులారా !
మన మాటలు
ఇసుకలో వ్రాసిన
పిచ్చివ్రాతలు కారాదు
నీటిలో దాచిన
ఉప్పుమూటలు కారాదు
తెల్లారగానే మెల్లమెల్లగా
మెలుకువ రాగానే
కరిగిపోయే
కమ్మనికలలు కారాదు
ఇసుకలో వ్రాసిన ఎంతటి
అందమైనా అక్షరాలైనా
అలలు తాకగానే
చెల్లాచెదురై పోతాయి
ఎంతటి బరువైన
ఉప్పుమూటైనా
నీటిచుక్క తాకగానే
కరిగిపోవుట ఖాయమే
అందుకే ఓ మిత్రులారా !
మన మాటలు
ఉలితో శిలపై అందంగా
చెక్కిన అక్షరాలు కావాలి
రాళ్లు ముక్కలైనా
అక్షరాలు చెక్కుచెదరవు
శిధిలమైన
శిలలపై చెక్కిన
దేవతా శిల్పాలెన్నో
వేలయేళ్ళుగా వున్నాయి
పూజలందుకుంటున్నాయి
గర్భగుళ్ళల్లో ఈనాటికీ
దర్జాగా దర్శనమిస్తున్నాయి
ఔను జీవముంటేనే దేనికైనా
మరణమంటూ ఉండేది...
రాళ్ళకు... రాతిశిల్పాలకు...
జీవమూలేదు...మరణమూలేదు



