Facebook Twitter
పొగిడి మరుగుజ్జుగా మారకు...

నీవు ఎవ్వరిని ఆకాశానికెత్తకు...
నీవు అగాధంలోనికి జారిపోకు..

ఎవరినైనానీవు "దొరా" అన్నావంటే...
ఓ దొరా నీవు నా తలపై కెక్కు
నన్నుఅధః పాతాళానికి అణద్రొక్కు అని అర్ధం

ఎవరినైనా నీవు "రాజా" అన్నావంటే...వాడు
ఔను నేను రాజానే నా తలపై బంగారుకిరీటం పెట్టు
నీవు నా సర్వెంట్ వి వంగి నాకు సలాంకొట్టంటాడు

ఎవరినైనానీవు "అన్నా"అని అన్నావంటే...వాడు
ఔను నేను అన్ననే నీకన్నా అన్నింటా నేమిన్ననే
నీవు మాత్రం గుండు సున్నవే అంటాడు

ఎవరినైనా నీవు "స్వామి" అన్నావంటే... వాడు
ఔను నేను స్వామినే వెంటేశ్వర స్వామినే నిన్ను
మాత్రం కొండకొచ్చి గుండుగీయించుకో మంటాడు

ఎవరినైనా నీవు "గురూ" అన్నావంటే...
నీవే వాడికి "గురువుగా గుర్తింపు" నిచ్చినట్లు
నీకు నీవే వాడికి "శిష్యుడిగా శిక్ష" వేసుకున్నట్లు

ఎవరినైనా నీవు "బ్రదర్" అన్నావంటే,
వ్యక్తులు వేరైనా భావాలు ఒక్కటేనని అర్ధం
ఆపదొస్తే ఒకరి కొకరు ప్రాణాలనర్పించుకుంటారు

అందుకే ఎవర్నీ అతిగా అనవసరంగా పొగడమాకు
నిన్ను నీవు తగ్గించుకోమాకు తక్కువచేసుకోమాకు
మరీమరీ పొగిడి నీవు మరుగుజ్జుగా మారిపోమాకు