నేటి శ్రమజీవులే రేపటి శ్రీమంతులు
"శ్రమ"అనగానే, పేరు వినగానే
సొమ్మసిల్లిపోయే "సోమరిపోతులు"
కష్టపడలేరు...కడుపులు నింపుకోలేరు
ఖర్చులను అదుపు చెయ్యలేరు
స్వేదం విలువ తెలిసిన"శ్రమజీవులే"తప్ప
అనవసరపు"ఖర్చుల్ని" అదుపు చేయకపోతే
అవి కళ్లాలులేని గుర్రాల్లా పరుగులు తీస్తుంటే
"అప్పులు" ఆంబోతుల్లా
తరుముకుంటూ వస్తాయి
ఓ కుదుపు కుదుపపేస్తాయి కుమ్మేస్తాయి
ఖర్చులను అదుపుచేసి పొదుపు చేస్తే
బ్రతుకు కాస్త "కుదుట పడినట్లే"
కుదుట పడితే చాలు "మీరు కుబేరులైనట్లే"
అనవసర ఖర్చుల అదుపే ఒక పొదుపైతే
పొదుపే ఒక మదుపైతే మదుపరులేగదా
ముందుచూపుతో ధనాన్ని కూడబెట్టువారు
నేడు కూడబెట్టినోళ్ళే రేపు కుబేరులయ్యేది
నేటి సోమరిపోతులే రేపటి బిక్షగాళ్ళు బికారులు
నేటి శ్రమజీవులే రేపటి ఆగర్భ శ్రీమంతులు
అదృష్టవంతులు ఆదర్శవంతులు అపరకుబేరులు



