Facebook Twitter
సూర్యుడే స్పూర్తి...

పనిముగించుకొని
పడమటి కనుమల్లో సూర్యుడు
కుంగిపోతాడు కునుకుతీస్తాడు  
మరునాడు
తూర్పున మెల్లగా ఉదయిస్తాడు
సూర్యుడే ప్రపంచానికి పంచప్రాణాలు
వెలుగురేఖలే ఆయన విసిరే బాణాలు

కునికే కుంభకర్ణుల్నిగురకలుపెట్టి
మొద్దునిద్దురపోయే బద్దకస్తుల్ని తట్టిలేపి
పరుగులు పెట్టిస్తాడు...ప్రభాతవేళ
భగ్గునమండి పోతాడు...మధ్యాహ్నంవేళ
చల్లగా ఉండి పోతాడు...సంధ్యవేళ

ఔను సూర్యుని కన్నముందులేస్తే...సుఖపడతారు
ఉదయించే సూర్యునిలా...వృద్ధిచెందుతారు
కాని పగలంతాపడుకొని చీకటిపడేవేళ లేచి
వెలుగుకోసం వెతికేవాళ్ళు...వెర్రివాళ్ళు
వారి చుట్టూ కమ్మేది...చిమ్మచీకట్లే...
వారికన్నీ...చిక్కులే...చీకాకులే...చింతలే‌

అంటారందుకే...అనుభవజ్ఞులు...
చీకట్లో కూర్చుని చింతించక...
చిరుదీపం వెలిగించుకోమని...
చీకట్లు తొలిగించుకోమని...

అంటారందుకే...ఆదర్శవంతులు...
ఉదయించే సూర్యున్ని స్పూర్తిగా తీసుకున్నవారికి
ఉద్యోగం చిక్కుతుందని ఉన్నతస్థానం దక్కుతుందని