Facebook Twitter
వారు...చరిత్రహీనులే

ఆరోగ్యవంతులకు
వైద్యుడు అక్కర లేదు రోగులకు తప్ప

ఆరోగ్యవంతులనెవరూ
ఐసీయూలో ఉంచరు
అతిప్రమాదకర స్థితిలో ఉన్నవారినే తప్ప

ఎవరూ తాము
కూర్చున్న కొమ్మను తాము నరుక్కోరు
మతిస్థిమితంలేని మూర్ఖపుకోతులు తప్ప

ఔను కంచే చేను మేస్తే
కాకులను కొట్టి గద్దలకేస్తే
ఎవరు తీసుకున్న గోతిలో వారే
పడతారన్నది అసత్యం కాదు నగ్నసత్యం తప్ప

మూర్ఖులకెవరికీ దక్కదు ముక్తి
భక్తితో భగవంతున్ని ప్రార్థించి
నిత్యం పరమాత్మ సేవలో తరించినవారికి తప్ప

అమ్మపాలనుఅమ్ముకున్నవారు
అరచేతిలో స్వర్గం చూపినవారు
నిరుపేదల కడుపులు కొట్టినవారు
నమ్మినవారిని నట్టేట ముంచినవారు నవ్వులపాలే

కార్మికులు కార్చిన కన్నీళ్ళతో
కడుపులు నింపుకున్నవారి అధికారపీఠాలు
బలహీనులను బలిపశువును చేసిన వారి బంగారు
సింహాసననాలు రెప్పపాటున కుప్పకూలిపోవునులే
వారు బలశాలులైనా బాహుబలులైనా చరిత్రహీనులే