వారు మహానటులు
వారు నవ్వుతారు నటిస్తారు
నలుగురి దృష్టిలో "నమ్మకస్తులు"
బరువు బాధ్యతలేమి
పట్టని పరమ "బద్దకస్తులు"
అమాయకత్వం
అఙ్ఞానం వారి" ఆస్తి"
కలుపుగోలుతనం
కష్టపడేతత్వం వారిలో "నాస్తి"
వారు సరదా సంతోషాలెరుగని
"పరమ శుంఠలే"
వారితో కలిసి తిరిగితే రగిలేది
"మనస్పర్థల మంటలే"
వారి చేతుల్లోవుండేది స్టీలు ప్లేట్లే
వారుగతికేది మాత్రం "పచ్చడి మెతుకులే"
వారు బసచేసేది మెట్రోలో కాని
బ్రతుకులు మాత్రం "పల్లెటూరి బ్రతుకులే"
వారు పోజుల్లో సినిమా "హీరోలు"
లోకఙ్ఞానంలో మాత్రం "వారు జీరోలు"
వారి వ్యవహారం పైనపటారం లోనలోటారం
వారి మీద ఆధారపడం...అవివేకం...అజ్ఞానం



