నీ చుట్టూ
నీచులుండొచ్చు
నికృష్టులుండొచ్చు
దుష్టులుండొచ్చు
దుర్మార్గులుండొచ్చు
రాక్షసులుండొచ్చు
రాబందులుండొచ్చు
దొంగలుండొచ్చు
దోచుకునేవారుండొచ్చు
చిరునవ్వు నవ్వుతూనే
చితిని పేర్చేవాళ్ళుండొచ్చు
కోతరాయుళ్ళుండొచ్చు
కొంపలు కూల్చేవాళ్ళుండొచ్చు
కొరగాని వాళ్ళుండొచ్చు
కొరకరాని కొయ్యలుండొచ్చు
దమ్మిడికి పనికిరాని
దగాకోరులుండొచ్చు
దద్దమ్మలుండొచ్చు
ఎందుకూ పనికిరాని
పరమ వేస్టుగాళ్ళుండొచ్చు
పచ్చిమోసగాళ్ళుండొచ్చు
విమర్శించే వాళ్ళుండొచ్చు
పైకి తియ్యని మాటలు చెబుతూ
లోలోపల విషం చిమ్మేవాళ్ళుండొచ్చు
కుట్రలుకు తంత్రాలు పన్నేవాళ్ళుండొచ్చు
వీరే విశ్వాసంలేని కుక్కలు
వీరే నీసొమ్ముతిని నీరొమ్మును
గుద్దే గుంటనక్కలు
వీరే నీవెనుక లోతుగా
గోతులు తీసే కోతులు
వీరే నవ్వుతూ నిన్ను
నట్టేటముంచే నయవంచకులు
అందుకే జాగ్రత్త ! బిడ్డా జరా జాగ్రత్త !
నమ్మకు ! బిడ్డా నమ్మకు !
ఈ తేనె పూసిన కత్తుల్ని
ఈ మేక వన్యపులుల్ని.



