Facebook Twitter
అమ్మ కన్నా అమ్మాయే మిన్న!

అమ్మ కన్నా అమ్మాయే మిన్న!

 

నిన్న పాలుత్రాగి పీకలదాకా

అమ్మపాలు అమృతం అన్నావు

 

నేడు పీకలదాకా మునిగి, పిచ్చిముదిరి

అమ్మాయి ప్రేమే అమృతమంటున్నావు

 

నిన్న అమ్మఒడిలో ఆడిఆడి 

ఆదమరచినిదుర పోయావు

 

నేడు అమ్మాయి ప్రేమలోపడి

నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నావు

 

నిన్న అమ్మచెంగు పట్టుకు తిరిగావు

నేడు అమ్మాయికొంగు పట్టుకుని

తిక్కరేగి కుక్కలా తిరుగుతున్నావు

 

నిన్న అమ్మ గోరుముద్దలు తిని పెరిగావు

నేడు అమ్మాయిని సెల్లో కిస్సులడుగుతున్నావు

 

నిన్న కనిపెంచిన అమ్మే కనిపించే దేవతన్నావు

నేడు అమ్మాయే నా ప్రాణం నా ఊపిరి

నా ప్రేయసి నా ఊహల ఊర్వశి అంటున్నావు

 

నిన్న కన్నతల్లిని కాలదన్ని

అమ్మాయి కాళ్ళమీద పడ్డావు కానీ

నేడు ఆ టక్కరి అమ్మాయి మరొకరి మీద 

కన్నేసింది...నిన్ను కాలితో తన్నేసింది...

 

అందుకే నేడు నేనొక "ప్రేమపిపాసిని"

అది ఒక "కామపిశాచి" అంటున్నావు

 

నిన్ను నిట్టనిలువునా 

ముంచినందుకు నిట్టూరుస్తున్నావు

మరొకరితో కులుకుతున్నందుకు

కుమిలిపోతున్నావు

 

అంతే అంతే ప్రేమంటే "అమృతం... విషం"

ఇంతే ఇంతే జీవితమంటే "జననం...మరణం"