Facebook Twitter
గుంటనక్కలకు...గుణపాఠం (మినీ కవిత)

                               

సహాయం అంటే చాలు 

చేతులు ముడుచుకుంటారు 

కొందరు "సోమరిపోతులు"...

 

సహాయం అందే అన్ని 

దారుల్ని అన్ని తలుపుల్పి 

మూసివేస్తారు కొందరు "అజ్ఞానులు"...

 

కళ్లు చెవులు ముక్కు నోరు 

మూసుకుంటారు కొందరు "మూర్ఖులు"...

 

పిలిచినా పలకరు 

ఆపదలో వున్నవారిని ఆదుకోరు 

ముందుకురారు కొందరు "పిరికిపందలు"...

 

సహాయం చెయ్యలేకున్నా చెయ్యగలిగేవారు 

తమకు తెలిసివున్నా వారిపేర్లైనా చెప్పరు

అడ్రసులైనాఇవ్వరు కొందరు "అహంకారులు"...

 

అట్టి మట్టి ఏనుగులను నమ్మి నట్టేట్లో దిగకండి

అట్టి గుడ్లగూబలకు"గుంటనక్కలకు గుణపాఠం" నేర్పండి