కన్న బిడ్డలు
తోబుట్టువులు
ప్రాణ స్నేహితులు
శ్రేయోభిలాషులెందరున్నా
అమ్మానానలు అత్తామామలు
కుటుంబ సభ్యులెందరున్నా
ఎన్నో ఏళ్లు కుటుంబ సమేతంగా
కూర్చొని తిన్నా తరగని ఆస్తులున్నా
తమ నెక్కడ కరోనా కాటేస్తుందోనని
దగ్గరకు వచ్చేందుకు భయపడుతుంటే
దూరంగా నిల్చుని కన్నీరు మున్నీరౌతుంటే
ధైవంపై భారంవేసి ధైర్యంగా ముందుకొచ్చి
అనాధ శవాలకు అంత్యక్రియలు చేసే
"ముస్లిం సేవా సమితి" సభ్యులందరికి
వందనం ! అభివందనం ! పాదాభివందనం!
కరోనా రోగుల శవదహనమంటే
కరోనా కాటుకు గురికావడమే
అకారణంగా కాటికి సిద్దం కావడమే
తమ ప్రాణాలను తమ కుటుంబ
సభ్యుల ప్రాణాలను ఫణంగా పెట్టడమే
అని తెలిసినా చిరునవ్వులు చిందిస్తూ
అనాధ శవాలకు అంత్యక్రియలు చేసే
"ముస్లిం సేవా సమితి" సభ్యులందరికి
వందనం ! అభివందనం ! పాదాభివందనం!
అదండీ నిజమైన ప్రజా సేవంటే
అదండీ నిజమైన మానవత్వమంటే
అమ్మానాన్నలు వారి ఆదరణ వద్దు
ఆస్తులు అంతస్తులే మాకు ముద్దనే
ఓ ఆశబోతులారా! ఓ అజ్ఞానులారా!
ఓ అహంకారులారా! ఓ అవివేకులారా!
చూడండి ఒక్కసారి వీరి మానవీయతను
వీరి నిస్వార్థ సేవాతత్పరతను త్యాగాన్ని
ఓ అధికారులారా! ఓ అంధులారా!
చూడండి ఒక్కసారి ఆ సభ్యుల సేవాగుణాన్ని
వారిలోని మంచితనాన్ని మానవత్వాన్ని
మనుజులులై జన్మనెత్తి ఈ మహిలో
ఎంతకాలం బ్రతికామన్నది కాదు...ముఖ్యం
ఎలాబ్రతికాం ఎందరినాదుకున్నామన్నదే ప్రధానం



