నియమబద్ద జీవితం నిత్య సుందరం.......
మన
చిత్తమెప్పుడూ
చిరునవ్వులు
చిందిస్తూ
నిర్మలంగా
నిశ్చలంగా
నిష్కల్మషంగా
ఉల్లాసంగా
ఉత్సాహంగా
రోజంతా
ప్రశాంతంగా
ఉండాలంటే
అరిషడ్వర్గాలు
మన అదుపులోనే
ఉండాలంటే
వ్యాయామం యోగ
ధ్యానం తప్పకచేయాలి
ఆపై గుడిచుట్టూ 108
ప్రదక్షిణలు చేయాలి
ఆథ్యాత్మిక గ్రంధాలను
పారాయణం చేయాలి
భగవంతున్ని స్మరించాలి
నిత్యం పూజలు చేయాలి
అందుకే
ముందుచూపుతో
అన్నాడో కవి
దయగల హృదయమే
దైవ మందిరమని...
నియమబద్ద జీవితమే
నిత్య సుందరమని...



