వద్దు బద్ధకం వద్దు సోమరితనం
బద్దకస్తులైన ఓ ఇద్దరు ప్రాణమిత్రులు
రోజూ సందేహంలో దగ్దమైపోతున్నారు
ఉదయాన్నే పార్క్ కి వెళ్ళాలా వద్దా అని
కారణం లాక్ డౌన్ కాదు.....మరేమంటే?
ఉదయాన్నే నిద్రలేవగానే రమ్మని
వాకింగ్, జాగింగ్, వ్యాయామం,
యోగా చెయ్యమని, ప్రతి రోజూ
"పార్కు" వారిని ప్రాధేయపడుతుందట
మూలనపడివున్న "వారి షూ" వారిని
వేడుకుంటుందట తమను వాడుకోమని
సూర్యనికంటే ముందులేస్తే సుఖపడతారని
మధురగీతాలతో "పక్షులు"అర్థిస్తున్నాయట
కిలకిలారావాలతో మేల్కొల్ఫుతున్నాయట
వారిని చూసి"వారి పడక" నవ్వుతుందట
వారు వేసుకున్న,గోడకు వ్రేలాడుతున్న
"హెల్త్ ప్లాన్లన్నీ.......ఆరోగ్యసూత్రాలన్నీ"
వెర్రిచూపులు చూస్తూ వెక్కిరిస్తున్నాయట
ఆ మిత్రులు మరువరాదు ఈ జీవనసూత్రాన్ని
ఎవరికి బద్ధకం సోమరితనం మిత్రులో వారికి
ఆరోగ్యం ఆనందం బహుదూరపు బంధువులే
అనారోగ్యం ఆసుపత్రులు అడుగుదూరంలోనే



