మా మాట వింటే ?
అతిగా ఆలోచించేవారు
ప్రతిదీ అనుమానించేవారు
లాభాలను గురించి కాక
నష్టాల గురించే ఊహించేవారు
ముందుచూపులేని వారినడిగి
సగం సందేహాలు తీర్చుకునేవారు
వారిచ్చే ఉచితసలహాలు స్వీకరించేవారు
తాడే పామనుకొని భయపడేవారు
వాయిదాల మీద వాయిదాలు వేసేవారు
త్వరగా మంచి నిర్ణయాలు తీసుకోలేనివారు
దమ్ము ధైర్యం నమ్మకం ఏదీలేనివారు
ప్లాట్లలో పెట్టుబడి పెట్టలేరు
పెట్టుబడి పెట్టి కోట్లు ఆర్జించినవారి
అదృష్టాన్నిచూసి తట్టుకోలేరు
అరెరే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
మాటలు విని ఉంటే
అంతో ఇంతో పెట్టుబడి పెట్టి ఉంటే
ఎంత బాగుండేదని మనసులో మదనపడతారు
ఇంటిపెద్దగా కుటుంబానికన్యాయం చేశామని
కుమిలిపోతారు కృంగిపోతారు
లేటుగా రైల్వే స్టేషన్ వెళ్లినవారెవరూ
ట్రైన్ కాచ్ చెయ్యలేరు
ఆలస్యంగా మ్యారేజ్ కి వెళ్ళినవారెవరూ
అక్షింతలు వెయ్యలేరు
కొత్తజంటను ఆశీర్వదించలేరు



