ముందు చూపుతో కొందరు
కొందరు ముందు చూపుతో
కొంచెం కొంచెం పొదుపు చేస్తారు
బ్యాంకు బ్యాలెన్స్ లక్షలు జమచేస్తారు
కొందరు ముందు చూపుతో
లక్షలు ప్లాట్లల్లో పెట్టుబడి పెట్టి
కోట్లు సంపాదిస్తున్నారు
అందుకే ముందు చూపులేని
ఆస్తులు ఆర్జించని అమ్మానాన్నలంటే
కన్నబిడ్డలకు సైతం చిన్నచూపే
ముసలితనంలో ఏదైనా జబ్బు చేసి
మంచంలో పడితే మందులివ్వరు
కంచంలో ఇంత కూడు పెట్టరు
మనసు విప్పి ప్రేమగా మాట్లాడరు
అమ్మానాన్నల కన్న ఆస్తే మిన్నంటారు
కూడబెడితేనే కూడు పెడతామంటారు
లేదంటే అమ్మానాన్నలను నిర్దాక్షిణ్యంగా
అనాధాశ్రమాలకమ్ముతారు ఐనా కూడా
ఈ అమాయకులు ఆ బిడ్డల్నేనమ్ముతారు



