ఎక్కువ ? తక్కువ ?
యువకులకు...
3 ఎక్కువ 4 తక్కువ
3 ఎక్కువ అంటే
ఆవేశం ఎక్కువే
ఆదాయం ఎక్కువే
ఆయుష్షు ఎక్కువే
కాని,
4 తక్కువ అంటే
అనుభవం తక్కువ
ఆలోచన తక్కువ
ఆచరణ తక్కువ
ఆప్యాయతలు తక్కువ
వృద్ధులకు ...
6 ఎక్కువ 3 తక్కువ
6 ఎక్కువ అంటే
అనుభవం ఎక్కువే
ఆప్యాయతలు ఎక్కువే
ఆలోచనలు ఎక్కువే
ఆచరణ ఎక్కువే
అనుమానాలు ఎక్కువే
చాదస్తం కూడ ఎక్కువే
కాని
3 తక్కువ అంటే
ఆవేశం తక్కువ
ఆదాయం తక్కువ
ఆయుష్షు తక్కువ



