Facebook Twitter
తొలి భారతీయ మహిళా వైద్యురాలు.. ఆనందీ గోపాల్  జోషి

తొలి భారతీయ మహిళా వైద్యురాలు.. ఆనందీ గోపాల్  జోషి

 

ఆనందీ గోపాల్  జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన  మొట్టమొదటి భారతీయ మహిళావైద్యురాలు ఆనందీ గోపాల్ జోషి గారు. ఈమె 1865 మార్చి 31 వ తేదీన మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. ఈమెకు తల్లిదండ్రలు యమున అని పేరు పెట్టారట. 9 సంవత్సరాల వయసులో గోపాల్ రావు జోషిని వివాహం చేసుకున్నారట. వివాహం తరువాత ఆమె భర్త ఆమెకు ఆనందీ బాయి అని పేరు పెట్టారట. విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి  ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారట. 14 సంవత్సరాల వయసులో ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చిందట. అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పదిరోజుల్లో చనిపోయాడట ఈ సంఘటనఆనందీబాయి జీవితంలో ఒకమలుపును తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావాలి అన్నదానికి ప్రేరణ నిచ్చింది.

గోపాలరావు తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కోసం ప్రయత్నాలు సాగించాడు. 1880 లో ఆయన రాయల్ విల్డర్ కు రాసిన లేఖలో ఆనందీ బాయికి యునైటెడ్ స్టేట్స్ లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికి విచారించారట. ఇద్దరు ఆలు మగలు క్రైస్తవ మతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించాడట. అయితే ఈ ప్రతిపాదన జ్యోషి జంటకు ఆమోదయోగ్యం కాలేదట. అయితే విల్డర్ ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్శన్ మిషనరీ రివ్యూలో ప్రచురించారట.  రొస్సెల్ న్యూజెర్సీకి చెందిన ధియోడెసియా కార్పెంటర్ అనే ఆవిడ తన దంత వైద్యుని కోసం ఎదురుచూస్తూ ఆయన కార్యాలయంలో యాద్రుచ్చికంగా  పత్రికలో ఆనందీభాయి గురించి చదివారట. 

వైద్య విద్య చదవాలన్న ఆనందీబాయి తపన దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త వ్రుత్తాంత ఆమెను కదిలించిందిట. ఆనందీబాయికి ఉత్తరం రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకు వచ్చిందట. కార్పెంటర్ కు ఆనందీభాయికి మధ్య అనేక విషయాలమీద ఉత్తరప్రత్యుత్తరాలునడిచాయట.  తర్వాత ఆమె సహకారంతో పాటు అనేక మంది భారతీయులు ప్రముఖులు ఆమె అమెరికా  వెళ్ళడానికి ఆర్ధిక సాయం చేశారట. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా ఆనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళారు. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ నెలలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగు పెట్టారట...మూడేళ్ళపాటు నానాపాటులు పడి...1886 మార్చి 11ను వైద్య విద్యలో డాక్టరేట్ సాధించారట. ఆమె పరిశోధనాంశం...ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ శిశు సంబంధిత వైద్యం...స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో సందేశాన్ని పంపారట. ఈ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం మరపురాని అనుభూతిని కలుగజేసిందట.

 భారతదేశానికి తిరుగు ప్రయాణం చేసిన సమయంలో ఆనందీభాయి ఆరోగ్యం మరింత దిగజారిందిట. మొత్తానికి 1886 చివరి భాగంలో ఆనందిబాయి భారతదేశానికి తిరిగి వచ్చేశారట. దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికిందట. కొల్తాపూర్ సంస్ధానానికి వైద్యురాలిగా నియమించిందట. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్య శాలలోని మహిళా వార్డుకు అధికారిణి బాధ్యతలు అప్పగించిందట. కలకత్తా చేరిన తర్వాత ఆమె తరుచూ జ్వరం ఆయాసాలతో బాధపడిందట. ధియోడిసియా ఆమెకు అమెరికా నుంచి ఔషధాలను పంపిందట. కానీ ఆమె 1887 ఫిబ్రవరి 26 వ దేదీన 22 సంవత్సరాల వయసులోనే అకాలమరణం చెందారట.ఆనందీ బాయి మరణానికి దేశమంతటా విషాదం ఆవరించిందట. ఆనందీబాయి చితాభస్మం ధియోడిసియాకార్పెంటర్ కు పంపారట. కార్పెంటర్ వాటిని ప్యూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ స్మశానవాటికలో భద్రపరిచిందట. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ స్మశాన వాటికలో ఇప్పటికీ చూడొచ్చు అంటారు. లక్నోలోని ఒక ప్రభుత్వ సంస్ధ ఇనిస్టిట్యూట్ పరిశోధన మరియు సాంఘిక శాస్త్రంలో ఆమె ప్రారంభ రచనలకు గౌరవం ఇస్తూ ఆనందీభాయి జోషి అవార్డు ప్రదానం చేసిందట. నిజంగా వైద్యరంగంలో ప్రవేశించి డాక్టర్ ని అవ్వాలని విదేశాలకెళ్ళి వైద్యరంగంలో పట్టా సాధించిన ఆనందీ గోపాల్ జోషి నిజంగా ఆదర్శమహిళ అన్నది అక్షరసత్యం.