జగన్ రాక్షస పాలనపై సమర శంఖం యువగళం!

జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం (జూన్ 4) రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

పాదయాత్ర నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు.  జగన్ అరాచకపాలనకు జనం చరమగీతం పాడి ఏడాది పూర్తయ్యిందనీ, అయినా జగన్ పాలన పీడకలను జనం ఇప్పటికీ మరచిపోలేదని పవన్ కల్యాణ్ అన్నారు.  ఈ సందర్భంగా తన యువగళం పాదయాత్ర అనుభవాలను లోకేష్ పవన్ కల్యాణ్ తో పంచుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu