వైసిపిలోకి కొనసాగుతున్న వలసలు

 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయిన దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు అధికార ప్రతిపక్ష పార్టీలతో పొసగక అసమ్మతి వర్గంగా ముద్రపడిన నాయకులు వైసిపి తీర్ధం పుచ్చకోవటానికి రెడీ అవుతున్నారు. ప్రస్థుత రాజకీయాల్లో విజయావకాశాలతో పాటు బలమైన నేతగా పేరున్న జగన్‌ పార్టీలో చేరడానికి ఎక్కువ మంది నాయకులు సుముఖంగా ఉన్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది నాయకులు జగన్‌ పార్టీలో చేరగా తాజా కాంగ్రెస్‌ పార్టీ ఎంపి ఎస్‌పివై రెడ్డి జగన్‌ పంచన చేరారు. వీరితో పాటు సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన కూడా జగన్‌ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే కేసులులో చాలా రోజులుగా జైళ్లో ఉండి ఇటీవలే బయటికి వచ్చిన మోపిదేవి వెంకటరమణ కూడా వైసిపిలో చేరడానికి పావులు కదుపుతున్నారు.

ఇక ఇటీవల రాజీనామ చేసిన మంత్రి విశ్వరూప్‌తో పాటు, రాజీనామలకు సిద్దమయిన ఎంపిలు సాయిప్రతాప్‌, అనంత వెంకటరామిరెడ్డిలు కూడా జగన్‌తో జతకట్టాలనుకుంటున్నారు. ప్రస్థుతం ఉన్న పరిస్థిత్తుల్లో సమైక్యాంద్ర కోసం బలంగా పోరాడుతున్న పార్టీ వైసిపి క్రెడిట్‌ సాధించటంతో పాటు అర్ధబలంగా కూడా బాగా ఉన్న జగన్‌ పంచన ఉంటే రాబోయే ఎలక్షన్స్‌లో ఈజీగా గట్టెక్కేయోచ్చని భావిస్తున్నారు చాలా మంది నేతలు. ఇది ఇలాగే కొనసాగితే మరింద మంది నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.