అమ్మ పుట్టినరోజు వేడుకలో వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ ఇవాళ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. విజయమ్మకు కేక్ తినిపించి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జగన్‌ను అప్యాయంగా ముద్దాడిన విజయమ్మ తన ఆశీస్సులు అందజేశారు. వేడుకల అనంతరం మా అమ్మ 60వ పుట్టిన రోజు వేడుకలను ఇలా జరుపుకున్నాం అంటూ తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.