మాజీ సీఎం జగన్ చేసే ర్యాలీలను నిషేధించాలి : షర్మిల

 

కారు కిందపడ్డ సింగయ్యను  వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.  సింగయ్య మృతికి జగన్ నిరక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా అని  పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. 3 కార్లకే పోలీసులు అనుమతి ఇస్తే వేల మందితో ఎందుకు పర్యటన చేశారని షర్మిల నిలదీశారు. 

కారు కింద పడిన వ్యక్తిని జగన్ పట్టించుకోకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ఇప్పటికే జగన్ చాలా తప్పులు చేశారని, అందుకే ఆయనపై కేసులు నమోదు అయ్యాయని షర్మిల వ్యాఖ్యానించారు. ఇటీవల పల్నాడులో జగన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్‌ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్లారన్నారు. సొంత పార్టీ కార్యకర్తపైనా మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ షర్మిల ఆక్షేపించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu