కాంగ్రెస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి...

 

ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి ఇప్పటివరకూ వైసీపీ నేతలు జంప్ అవడం చూశాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. కాంగ్రెస్‌ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్‌ చౌదరి, మంజునాథ చౌదరి సహా 500 కుటుంబాలు చెందిన వారు వైఎస్సార్ సీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. జగన్‌ పార్టీ కండువాలతో వీరికి సాదర స్వాగతం పలికారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu