జగన్ సైలెన్స్ పై సస్పెన్స్
posted on Sep 26, 2015 11:10AM

ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వపై విరుచుపడదామా అని చూస్తుంటారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్ష చేపట్టాలని ఎప్పుడో తేదీ ఖరారు చేసుకున్నా అందుకు ఏపీ ప్రభుత్వం.. పోలీసులు అనుమతివ్వలేదు. మరోవైపు దీక్ష కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరిస్తూ సాధారణ రీతిలో హైకోర్టులో అపీల్ చేసుకోవాలని చెప్పారు. ఈ పరిస్థితుల్లో జగన్ దొరికిందే ఛాన్స్ కదా అని అధికార పార్టీని ఏకిపారేయోచ్చు.. కానీ అలాంటిది ఏమీ లేకుండా తన దీక్షను వాయిదా వేసుకోవడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీక్ష చేసి తీరుతామని వైకాపా వర్గాలు కూడా చెప్పాయి. సాధారణంగా అయితే ఇలాంటి సమయంలోనే దీక్షలు చేసి పోలీసుల చేత అరెస్ట్ అయి సింపతి కొట్టేయాలని చూస్తారు. కానీ జగన్ అవేమీ చేయకుండా చాలా సింపుల్ గా హైకోర్టు మీద సాకుతో ఈ దీక్షను వాయిదా వేశారు. అయితే దీని వెనుక కారణం మాత్రం రామోజీరావు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ రామోజీరావును కలిసిన తరువాతే మెతకబడ్డారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా జగన్ మళ్లీ దీక్షను అక్టోబర్ 6 లేదా 7 తేదీల్లో చేపడుతారని.. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని జగన్ వర్గాలు తెలుపుతున్నాయి.