యువత మీ హృదయం కాస్త  జాగ్రత్త...


యువతరానికి గుండెపోట ఇదేమిటి అప్పుడే గుండెపోటు ఏమంత వయసు అయ్యిందని యువత గుండెపోటుకు గురిఅవుతున్నారు అన్నది అందరినీ సందిగ్ధం లో పడేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి ఎం పి బండారు దత్తా త్రేయ కుమారునికి 21 సంవస్త్సరాలు యువకుని పేరు వైష్ణవ్ గుండెపోటు తో మరణించినట్లు సమాచారం. అందరూ ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురియారు.పైగా వైష్ణవ్ ఒక వైద్య విద్యార్ధి కావడం గమనార్హం.

చిన్నవయస్సులో గుండెపోటు కు గురికావడం పట్ల సర్వత్రా ఉలిక్కి పడ్డారు అప్పుడే మొదలయ్యింది చిన్నవయస్సులో గుండెపోటు ఏమిటి? ఎందుకు వస్తుంది?

అన్న ప్రశ్నలకు సమాధానం రాకుండా నివారించాలేమా? అసలు అంత చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకు వస్తోంది అన్న అంశాల పై దృష్టి సారించారు నిపుణులు.మనదేశం లో అత్యధిక మరణాలు గుండెజబ్బుల మూలంగానే అని అనడం లో అతిశయోక్తి లేదు.ఒకవైపు ఆధునికత, మరోవైపు పోటీ తత్వం వృత్తి పరంగా,విద్య లో పోటీ పెరగడం తో విపరీతమైన   ఒత్తిడి పెరగడం తో శరీరం లో ని ప్రతి అవయవమూ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అని అంటున్నారు నిపుణులు ఒత్తిడి కారణంగానే రకరకల రోగాల్ బారిన పడడం గమనించవచ్చు.అవే వారి పాలిట మృత్యు ఘంటి కలుగా మారుతున్నాయి.

వాటిలో ప్రధాన మైనది క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్...

క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లో గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది.శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోవడం వైద్యులు అంటూ ఉంటారు. ఫలితంగా నీరసం,ఆయాసం, శరీరం లో ని పదాలు చీలమండలాలలో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాగే కొంతకాలం కొనసాగితే గుండె కండరం బలహీన పడడం లేదా బిగుతుగా మారడం వల్ల గుండె కొట్టుకునే సామర్ధ్యం తగ్గి రక్త ప్రసరణ లో వేగం తగ్గుతుంది. కొంత కాలానికి అది ప్రనాన్తకంగా మారుతుంది.

ఆర్టరీ డిసీజ్ కు కారణాలు...

గతంలో గుందేసమస్యలు కేవలం 5౦ సంవత్సరాలు వచ్చిన వారిలోమాత్రమే కనిపించేది.కనీ ఇప్పుడు25 సంవత్సరాల నుండి 4౦ సంవత్సరాల వయస్సు ఉన్న వారిని సైతం గుండెపోటు కు గురికావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆందోళనకు గురి చేస్తోంది.ప్రాణాలను హరిస్తోంది.గుండె సమస్య ఏదైనా సరే కారణాలు చాలానే ఉంటాయి. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణాలలో ముఖ్యమైనది సరైన జీవన శైలి లేకపోవడమే,లేదా చెడు అలవాట్లు, ముఖ్యంగా పొగ తాగడం, ఒత్తిడికి గురికావడం, కీలక పరిణామం గా వైద్యులు పేర్కొంటున్నారు.గతంలో ఎన్నడూ లేనివిధం గా యువత లో ఒత్తిడికి గురి అవుతున్నారని ఒత్తిడి ఉన్న కనిపించకుండా ఉండేవారని. ఇప్పుడు సహజంగానే జీవితం లో వస్తున్న మార్పులు జీవితం లో కావాల్సిన అవసరాలు పెరగడం ఆశలు పెరగడం తగిన విధంగా పని చేయాల్సి రావడం తో తీవ్ర ఒత్తిడికి కాక తప్పడం లేదు.పిల్లలలో వారి స్థాయికి మించి ఆశించడం వల్ల బాల్యంనుండే పిల్లలు ఒత్తిడికి గురిఅవుతున్నారు.అలా వయస్సు పెరిగే కొద్దీ మరింత బాధ్యతలు పెరిగి ఒత్తిడిని ఎదుర్కోవడం వల్లే ఒకవైపు గుండె సమస్యలు లేదా ఆత్మహాత్యలకు పాల్పడడం మనం చూస్తున్నాము.

జీవన శైలి లో మార్పులు కరనమేనా ...

ఏ వృత్తిలో ఉన్నవారైనా శారీరక శ్రమ తగినంత ఉండడం లేదు. తగిన వ్యాయామం చేయడానికి తగిన సమయం దొరకడం లేదు. వీరు తీసుకునే ఆహారం కూడాసమతులంగా ఉండకపోవడం చాలా మందిలో అధిక బరువు స్థూలకాయం సాధారణం గా కనిపిస్తుంది. శరీర బరువు కూడా ఒకకారణ మైతే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణా లకు ప్రాధాన కారణం ఊబకాయామే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఇప్పుడు చాలా మంది యువకులలో చాలా మంది రాత్రి పూట మేలుకునే ఉద్యోగాలాలో ఉంటున్నారు. ఇలాంటి వారిలో స్లీప్ ప్యాత్రాన్ సరిగా లేకపోవడం రకరకాల అనారోగ్యాలకు పరోక్షంగా గుండె కిడ్నీ వంటి ముఖ్యమైన అన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి ని తగ్గించే క్రమం లో రక రకాల అలవాట్లకు యువత పాల్పడుతోంది.తాత్కాలిక ఉపసమనం కోసం చేసుకునే అలవాట్లు ప్రతిరోజూ అలవాటుగా మారి దీర్ఘకాలం లో శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాట్లు వ్యసనాల కారణంగా బిపి రక్త నాళాల పైన తీవ్రమైన ఒత్తిడి నష్టం చేస్తుంది.ఈ కారణంగానే కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు,హార్ట్ ఎట్టాక్ వచ్చే అవకాశాలు ఉన్న్నాయి. హార్ట్ ఎట్టాక్ వచ్చిన వారిలో గుండె కండరం దెబ్బతినడం,లేదా హార్ట్ ఫైల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.పుట్టుకతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా హార్ట్ ఎట్టాక్ కు కారణమౌతాయి.

నివారణ సాధ్యమేనా?...

గుండె జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి లక్షణాలు కనపడ్డ వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకు ప్రమాదం కాకుండా జాగ్రత్త పడడం అత్యవసరం.

దీనికోసం చిన్నపాటి జాగ్రతలు పాటించడం అవసరం...

వీలైనంత మేరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండడా నికి దూరంగా ఉండే ప్రయాత్నం చేయాలి.

ఇందుకోసం యోగా ధ్యానం చేయడం ఉత్తమం...

ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం తప్పని సరిగా చేయడం అలవాటు చేసుకోవాలి...

సమతుల పోషక ఆహారం పాలు,కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,ఆహారం లో భాగం చేసుకోవాలి...

కుటుంబ సభ్యులతో కాస్త గడపడం వల్ల ఒత్తిడి ని అధిగమించ వచ్చు.ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ప్రాణాపాయ స్థితి నుండి మిమ్మల్ని కాపాడ తాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న దేశానికీ అవసరం, మీ ప్రాణం అత్యంత విలువైనది. అని గ్రహించండి. మీ ఆరోగ్యం మీగుందే మీచేతుల్లోనే ఉందని గుర్తించండి.  ప్రధాన కారణం ఊబకయమే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.