'ఎవడు' రిలీజ్ వాయిదా?

 

Yevadu release postponed, telangana Yevadu release,Yevadu release telangana issue

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా రిలీజ్ పై సస్పెన్స్ నెలకొనివుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలయ్యే వారంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ సినిమా రిలీజ్ ను నిర్మాత దిల్ రాజు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

కాంగ్రెస్ తెలంగాణ పై ఏ నిర్ణయం తీసుకున్న ఏదో ఒక ప్రాంతంలో వివాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్ల పై పడకుండా ఉండడానికి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు ప్రెస్ పెట్టనున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu