ఎల్లో మీడియా అసత్య కథనాలు చేస్తోంది
posted on Nov 21, 2011 8:09AM
ఖమ్మం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులు ఒకొక్కరే వెళ్ళిపోతున్న నేపద్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలం శాసనసభ్యురాలు కుంజా సత్యవతి డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కను కలవడం చర్చకు దారి తీసింది .అయితే తను జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు తాను డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కను కలిశానని వివరించారు. ఆదివాసీల సమస్యలు ఆయనకు వివరించినట్లు చెప్పారు. ఉపసభాపతితో రహస్య సమాలోచనలు జరిపినట్లు ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 24వ జరుగుతున్న జగన్ వర్గం ఎమ్మెల్యేల సమావేశానికి హాజరవుతానని ఆమె చెప్పారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానన్నారు.