మంత్రి సోమిరెడ్డి సభకు రావాల్సింది-రోజా

 

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రోజా...ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభపై మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జనమే లేరని విమర్శలు చేసిన సోమిరెడ్డి... ఇచ్ఛాపురంలో జరిగిన సభకు వచ్చిఉంటే జనం కాళ్ల కింద వేసి తొక్కేసేవారని వ్యాఖ్యానించారు. ఐదు సార్లు ఓడిపోయి మంత్రి పదవి స్వీకరించడానికి సోమిరెడ్డికి సిగ్గుండాలని అంటూ మండిపడ్డారు. కోడికత్తి కేసు ఎన్‌ఐఏకి బదిలి కావడంతో తెర వెనుక వున్న తెలుగుదేశం నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu