గాయపడిన రోజా

 

చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ మధ్యలోకి వెళ్ళిన నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా స్వల్పంగా గాయపడ్డారు. ఆమె చేతికి వున్న గాజులు పగలటంతో చేతిమీద స్పల్ప గాయమై రక్తస్రావమైంది. నగరిలో ఏటా జరిగే అమ్మవారి జాతర చివరి రోజు ప్రోటో కాల్ ప్రకారం దేవతలకు ఎమ్మెల్యే ప్రధాన హారతి ఇవ్వడం ఆనవాయితీ. నగరి ఎమ్మెల్యే హారతి ఇస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో రోజా చేతికి గాయమైంది. దాంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఆ తర్వాత సర్దుమణిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu