అది కూడా పవన్ చెబితే బావుంటుంది.. యనమల
posted on Aug 19, 2015 4:40PM
.jpg)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భూసేకరణ వద్దంటూ.. మూడు పంటలు పండే భూములను రైతల దగ్గర నుండి లాక్కోవద్దంటూ ట్వీట్టర్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీఎం చంద్రబాబు మరోసారి ఆలోచించాలని కూడా సూచించారు. భూసేకరణ నుండి ఉండవల్లి, పెనుబాక, బేతపూడి గ్రామాలను మినహాయించాలని చంద్రబాబును కోరారు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆర్ధిక మంత్రి యనమన రామకృష్ణుడు స్పందించి పవన్ కళ్యాణ్ భూసేకరణ వద్దు.. భూములు లాక్కోవద్దు అంటున్నారు. మరి భూసేకరణ వద్దంటున్న పవన్ కళ్యాణ్ ఏం చేయాలో కూడా చెబితే బావుంటుందని అన్నారు. భూసేకరణ లేకుండా రాజధాని అభివృద్ధి ఏలా జరుగుతుందని అన్నారు. అయిలా దానికి తగిన పరిహారం కోరాలి కాని భూసేకరణ వద్దంటే ఎలా అని ప్రశ్నించా